- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ కూతురి పేరు తెలుసా?
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ జంటకు జనవరి 11న ఆడపిల్ల జన్మించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విరుష్క జంట ఆ పాప ఫొటోలు కానీ, మరే ఇతర విషయాలు కూడా బయటకు చెప్పలేదు. తాజాగా అనుష్క సామాజిక వేదికల్లో తన కూతురి ఫొటోనే షేర్ చేసుకుంది. అంతే కాకుండా ఆ పాప పేరు ‘వామిక’ అని పేర్కొన్నది.
‘మేము ఎంతో ప్రేమగా కలసి జీవిస్తున్నాము. అయితే ఈ చిన్నతల్లి వామిక మా జీవితాలను మరో స్థాయికి తీసుకొని వెళ్లింది. కన్నీళ్లు, ఆనందం, బాధ, సంతోషం ఇలా అన్ని భావోద్వేగాలను మేము కేవలం నిమిషాల వ్యవధిలో అనుభవిస్తున్నాము’ అంటూ అనుష్క ట్వీట్‌లో పేర్కొన్నది. అనుష్క, విరాట్ కలసి ఉన్న ఈ ఫొటోలో పాపను ఎత్తుకున్నారు. అయితే పాప తల కనిపిస్తున్నా మొఖం మాత్రం కనిపించడం లేదు. కాగా విరుష్క జంట తమ బిడ్డకు పేరు పెట్టడంతో అభిమానులు ఆనందిస్తున్నారు. చాలా మంది వారికి అభినందలు తెలియజేస్తున్నారు.