- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రహానే తెలివైన కెప్టెన్ : సెహ్వాగ్
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో మొదటిరోజు భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆసీస్‌పై పై చేయి సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన రహానేపై పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. అంతేగాకుండా ఈ మ్యాచ్‌లో అశ్విన్, బుమ్రా, సిరాజ్ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కితాబిచ్చాడు. అదే విధంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రహానే ఎంతో తెలివిగా ఫీల్డింగ్ సెట్ చేశాడాని కొనియాడాడు. ‘‘మొదటి రోజు కేవలం 195 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేయడం గొప్ప విషయం. బౌలర్ల సేవలను ఉపయోగించుకున్న కెప్టెన్ రహానే తీరు అమోఘం. ఫీల్డింగ్ విషయంలో కూడా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్, బుమ్రా, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించే విధంగా చేయాల్సిన బాధ్యత బ్యాట్‌మెన్లపై ఉంది.’’ అని వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.