- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆ సత్తా కొహ్లీకే ఉంది'
దిశ, స్పోర్ట్స్ :
భారత జట్టు సారథి విరాట్ కొహ్లీ ప్రపంచంలోనే అత్యద్భుతమైన బ్యాట్స్‌మన్ అని.. టీం ఇండియాను మరో స్థాయికి తీసుకెళ్లగలిగే సత్తా అతడికే ఉందని ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బోథమ్ అన్నాడు. ప్రత్యర్థులు విసిరిన లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తూ ‘కింగ్ కొహ్లీ’ అని పేరు తెచ్చుకున్నాడు. తన ప్రతిభతో దిగ్గజ క్రికెటర్ సచిన్ రికార్డులను కూడా అతడు తిరగరాస్తున్నాడని బోథమ్ ప్రశంసించాడు. ఒక సారి కొహ్లీ బరిలోకి దిగాడంటే.. ఆటను ప్రత్యర్థుల నుంచి లాగేసుకుంటాడని.. తన జట్టులోని ఆటగాళ్లకు ఎంతో అండగా ఉంటాడని ఆయన చెప్పాడు. తనకు కొహ్లీతో కలసి ఆడే అవకాశం ఉంటే చాలా సంతోషించేవాడినని బోథమ్ చెప్పాడు. ప్రస్తుత తరంలో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు రావడం లేదని.. దానికి క్రికెటర్లకు పనిభారం పెరగడమేనని బోథమ్ అభిప్రాయపడ్డాడు. గతంలో భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడని.. అతడు ఎంతో కష్టపడేవాడని బోథమ్ అన్నాడు. ఈ తరంలో మనం మళ్లీ కపిల్ లాంటి వ్యక్తులను చూడలేమని చెప్పాడు.