- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాపిట్లో బొట్టు, మెళ్లో నల్లపూసలు.. షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన మిల్క్ బ్యూటీ.. (పోస్ట్)
దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘హ్యాపీ డేస్’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ సంపాదించుకున్నది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ బ్యూటీ డాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తూ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఇక త్వరలో ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.
అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ పిక్స్, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా తమన్నా తన ఇన్‌స్టా గ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో నుదుటున కుంకుమ పెట్టుకుని, మెళ్లో నల్ల పూసల దండ ధరించుకొని ఒక బాబుని ఎత్తుకుని ఫొటోలకు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు పెళ్లి చేసుకున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.