- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రోజు క్రికెట్ ఆడటం మానేస్తా.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: T20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. అప్పటికే టీమిండియా సెమీస్ ఆశలు ఆవిరి కావడంతో ఈ మ్యాచ్ ఫలితంపై పెద్దగా ఆసక్తి లేకపోయింది. దీంతో T20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి, హెచ్ కోచ్‌గా రవిశాస్త్రికి టీమిండియా విజయంతో వీడ్కోలు పలికింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాస్త భావోద్వేగం చెందాడు.
‘‘ఇప్పుడు చాలా రిలీఫ్‌గా ఫీలవుతున్నా. T20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గౌరవం. కానీ, ఇప్పుడు ఆ బాధ్యత వదిలేసి ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. మా ప్లేయర్స్ అద్భుతంగా ఆడుతున్నారు. మెగా టోర్నీలో అనుకున్న ఫలితాలు రాలేదని తెలుసు. కానీ, బాగానే ఆడాము. T20 క్రికెట్ భిన్నమైంది. మొదటి రెండు ఓవర్లలో ఎవరు పైచేయి సాధిస్తారో వారి అధిపత్యం కొనసాగుతుంది. తొలి రెండు మ్యాచ్‌లలో మేం ఇదే మిస్సయ్యాం. రవి భాయ్(రవిశాస్త్రి), సహాయక సిబ్బందికి ధన్యవాదాలు. సంవత్సరాలుగా వారు గొప్పగా సేవలందించారు. T20ల్లో కెప్టెన్‌గా తప్పుకున్నంత మాత్రాన నా ఆటలో దూకుడు తగ్గిపోదు. ఒకవేళ అలా ఆడలేకపోతే, అప్పటి నుంచే క్రికెట్ ఆడడం మానేస్తా. నేను కెప్టెన్ కాకముందు కూడా ఆటపైనే ధ్యాస పెట్టాను.’’ అని విరాట్ కోహ్లీ వెల్లడించారు.
చరిత్ర సృష్టించిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్
- Tags
- Bcci