బౌలర్‌ను ఏదో అనబోయిన బెన్‌ స్టోక్స్.. కోహ్లీ రాకతో సీన్ రివర్స్ 

by Shiva |
బౌలర్‌ను ఏదో అనబోయిన బెన్‌ స్టోక్స్.. కోహ్లీ రాకతో సీన్ రివర్స్ 
X

దిశ వెబ్ డెస్క్ : అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియం వేదికగా ఈరోజు టీం ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు జరుగుతోంది. ఈ టెస్టు తొలి రోజు ఆటలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్‌ స్టోక్స్‌ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై స్టోక్స్‌ అసహనం వ్యక్తం చేశాడు. దానికి కోహ్లీ ధీటుగా బదులిచ్చాడు. ఆటలో భాగంగా మొదటి సెషన్ 12వ ఓవర్‌ ముగిశాక ఈ ఘటన చోటుచేసుకుంది. భారత స్టార్ బౌలర్ సిరాజ్ 12వ ఓవర్‌ తొలి బంతికే ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను పెవిలియన్‌కు పంపి, ఈ మ్యాచ్‌లో తన ఖాతాలో తొలి వికెట్‌ వేసుకున్నాడు.

https://twitter.com/G_Lerole/status/1367353222596354050?s=20

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోక్స్‌కు పదునైన బంతులు వేస్తూ చుక్కలు చూపించాడు. మొదటి 3 బంతుల్లో ఒక్క పరుగు కూడా నమోదు చేయకుండా కట్టడి చేశాడు. దీంతో సిరాజ్‌పై అసహనం వ్యక్తం చేసిన స్టోక్స్‌.. ఏదో అనబోయి ఆగిపోయాడు. సిరాజ్‌ మాత్రం పెద్దగా స్పందించలేదు. కోహ్లి మాత్రం స్టోక్స్‌ బదులిచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అంపైర్లు నితిన్‌ మీనన్‌, వీరేందర్‌ శర్మ మధ్యలో వచ్చి వారిద్దరికీ సర్ది చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.

Advertisement

Next Story