- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రహానే సత్తా చాటేందుకు ఇదే సరైన సమయం : కోహ్లీ
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఆటగాడు అజింక్య రహానే ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. అతడికి ఇదే సరైన సమయమని.. తాను లేకపోయినా జట్టును విజయవంతంగా నడిపించగలడని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. కీలకమైన తొలి టెస్టు ముందు కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. తన గైర్హాజరీలో టీమ్ ఇండియా బలహీనపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.. కానీ నేను లేకపోయినా ఎలాంటి నష్టం ఉండదని కోహ్లీ అన్నాడు.
‘గత కొన్నేళ్లుగా నేను రహానేతో కలసి ఆడుతున్నాను. మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉన్నది. గతంలో ఎన్నో సార్లు మేమిద్దరం మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాము. అంతే కాకుండా రెండు వార్మప్ మ్యాచ్‌లలో జట్టును విజయవంతంగా నడిపించడమే కాకుండా తాను కూడా పరుగులు రాబట్టాడు. అతడికి జట్టు బలాబలాలు అన్నీ తెలుసు’ అని కోహ్లీ అన్నాడు. కోహ్లీ భార్య అనుష్క ప్రస్తుతం గర్బంతో ఉండటంతో తొలి టెస్టు అనంతరం అతడు లీవ్ తీసుకున్నాడు. కోహ్లీ గైర్హాజరీలో అజింక్య రహానే జట్టును నడిపించనున్నాడు.