కరోనాపై పోరాటానికి 'విరుష్క జోడీ' విరాళం

by Shyam |
కరోనాపై పోరాటానికి విరుష్క జోడీ విరాళం
X

కరోనాపై పోరాటానికి తమ వంతు సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘పీఎం కేర్స్ ఫండ్’కు విరివిగా సహాయం చేసి కరోనాపై పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మలు ‘పీఎం కేర్స్ ఫండ్‌’కు సహాయం అందిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పీఎం కేర్స్‌తో పాటు మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు కూడా విరాళం ఇస్తున్నట్టు చెప్పారు. కాగా, వీరు విరాళంగా ఎంత మొత్తం ఇస్తున్నారన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ‘కరోనా వల్ల ఎంతో మంది బాధపడుతుండటం మా ఇద్దరి హృదయాలను కలచివేస్తోంది. కష్టాల్లో, బాధల్లో ఉన్న వారికి మా విరాళం ఏదో విధంగా సాయపడుతుందని ఆశిస్తున్నాం’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు

Tags : Corona, Virat-Anushka, Virushka, Donation, PM Cares Fund

Advertisement

Next Story