- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్రమెక్కిన వరుడికి వింత అనుభవం.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి వేడుక అనేది ఎంతో ప్రత్యేకమైంది. ఎంతో మంది పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చు అయినా భరిస్తారు. డిఫరెంట్‌గా ఉండాలని ట్రై చేస్తారు. అలా ట్రై చేసిన ఓ వరుడికి చేదు అనుభవం ఎదురైంది. పెండ్లివేడుకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. రాజస్ధాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలోని రాంపురా గ్రామంలో పెళ్లి మంటపానికి చేరుకునేందుకు వరుడు గుర్రంపైకి ఎక్కి బయలు దేరుతున్నాడు. ఈ క్రమంలో పెళ్లి వేడుక సందర్భంగా సన్నిహితులు, కుటుంబ సభ్యులు టపాసులు పేల్చారు. దీంతో ఒక్కసారిగా భయపడిన గుర్రం పరుగు తీసింది. గుర్రాన్ని కంట్రోల్ చేసేందుకు వరుడు ఎంత ట్రై చేసిన గుర్రం మాత్రం ఆగలేదు.
దీంతో, నాలుగు కిలోమీటర్ల దూరంలో గుర్రం వెనుక కార్లు, బైకులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. మొత్తం మీద పెళ్లి కుమారుడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.