- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డ్యాన్స్‌తో ఇరగదీసిన అలనాటి అందాల భామ.. ఎందుకో తెలుసా?
దిశ, సినిమా: అలనాటి అందాల నటి భాగ్యశ్రీ.. తన కుమారుడు అభిమన్యు దాసాని నటించిన ‘మీనాక్షి సుందరేశ్వర్’ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేసింది. ‘టిట్టర్ బిట్టర్’ అనే సాంగ్‌కు తను స్టెప్పులేసిన వీడియోను షేర్ చేస్తూ ‘కొత్త సంవత్సరం, కొత్త ప్రారంభం! నా కొడుకు మొదటి నెట్‌ఫ్లిక్స్ చిత్రం ‘మీనాక్షి సుందరేశ్వర్’ విడుదలైందని తెలిపింది. ఇప్పటికే ప్రేమను కురిపించిన మీ అందరికీ ధన్యవాదాలు. సినిమాను ఇంకా చూడకపోతే మీ ప్రియమైన వ్యక్తితో వెళ్లి చూసేయండి. పాప్‌కార్న్ తింటూ మళ్లీ ప్రేమలో పడండి. మీ ఆశీర్వాదాలకు అందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొంది. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇక ‘మీనాక్షి సుందరేశ్వర్’కు మనోహరమైన చిత్రమనే ప్రశంసలు లభిస్తుండగా.. అభిమన్యు దాసాని నేటితరం హీరోల మాదిరిగా కాకుండా, చాలా డిగ్నిఫైడ్‌గా ఉన్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా హీరోయిన్గా నటించింది. తమిళ మధ్య తరగతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని వివేక్ సోని తెరకెక్కించాడు. కాగా అభిమన్యు దాసాని 2018లో వాసన్ బాలా చిత్రం ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’తో అరంగేట్రం చేశాడు.
https://www.instagram.com/reel/CV5CJC4Ivsc/?utm_source=ig_web_copy_link