ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన.. మంత్రి గంగులపై సీఈసీకి ఫిర్యాదు

by Anukaran |
Minister Gangula Kamalakar
X

దిశ, కరీంనగర్ సిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్, ఆయన అనుచరులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అధికార దర్పంతో నిబంధనలు తుంగలో తొక్కి, పోలింగ్ కేంద్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అంతేగాకుండా.. పోలింగ్ బూత్ ఎదుట నినాదాలు చేస్తున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసు అధికారులను కూడా బెదిరింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిబంధనలు ఉల్లంఘించిన తీరుకు సంబంధించిన వీడియో క్లిప్‌లను కూడా సీఈసీకి పంపినట్లు ఆయన విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. మంత్రి వ్యవహారశైలి భవిష్యత్తులో ఇతరులకు ఆదర్శంగా మారే అవకాశాలు ఉన్న దృష్ట్యా, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Advertisement

Next Story