- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'వైరల్ ‘లోడ్’ అత్యంత ప్రమాదకరం'
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను మరింత ప్రబలిస్తున్న ‘వైరల్ లోడ్’ అత్యంత ప్రమాదకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ వైద్య నిపుణులు, ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ కె. శ్రీనాథ్ రెడ్డి, సౌత్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ మూర్తితో వినోద్ కుమార్ ఆదివారం కరోనా అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. కరోనా వైరస్ విజృంభణ, దానిపై పోరాటానికి అనుసరించాల్సిన మార్గాలపై ఈ చర్చ కొనసాగింది. అనంతరం వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. శ్వాస, గొంతు సమస్యలు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఒక గదిలో గానీ, జన సమూహం ఉన్న హాలులో గానీ ఉంటే.. సదరు వ్యక్తి వద్దకు ఎవరైనా పలుమార్లు రాకపోకలు సాగిస్తే సహజంగానే ఆ వ్యాధి ఆయా వ్యక్తులకు సోకి ‘వైరల్ లోడ్’ గా పరిణమిస్తుందన్న విషయాలను వైద్య నిపుణులు నిర్ధారించారన్నారు.
మూకుమ్మడి భేటీలకు దూరంగా ఉండటం ద్వారా వైరల్ లోడ్‌ను నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కఠిన స్వీయ నియంత్రణ మాత్రమే వైరల్ లోడ్‌కు ప్రత్యామ్నాయ మార్గమని తెలిపారు. ఇదే విధానాన్ని మరో రెండు నెలల పాటు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Tags: Coronavirus, Viral load, Planning commission, Vinod Kumar