- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'వాళ్లు కండ్లున్న కబోదులు'
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు కండ్లున్న కబోదుల లాగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పని తీరును ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో కూడా రైతులు నష్టపోవొద్దన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కండ్లు ఎందుకు కనిపంచడం లేదని ప్రశ్నించారు. రైతులు సంతోషంగా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సహించలేని దుస్థితిలో పడిపోయి, కుళ్లు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. వారు మొసలి కన్నీరు కారుస్తున్నారు తప్ప రైతుల పట్ల ఏమాత్రం గౌరవం లేదన్నారు. మార్కెట్లో ఎదురవుతున్న చిన్నా, చితక సమస్యలను భూతద్దంలో చూపడం ఎంత వరకు సమంజసమని విపక్షాలను ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతుల నుంచి కనీస మద్దతు ధరకే పంటలు కొనుగోలు చేసేలా చూడాలని వినోద్ కుమార్ హితవు పలికారు.
Tags: Bjp,Congress,Market,Paddy,coronavirus,Lockdown