- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్, నీరు ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి: సబితారెడ్డి
దిశ, రంగారెడ్డి: గ్రామాలల్లో విద్యుత్, నీరు ఉంటే అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లాలోని దారూర్ మండలంలోని డోర్నాల్ గ్రామంలో చెక్ డ్యాంల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రతి ఎకరాకు నీరు, కరెంట్, ఎరువులు అందుబాటులో ఉంటే రైతులు సంతోషంగా ఉంటారని అన్నారు. ఈ సౌకర్యాలు ఉంటే 20 సంవత్సరాలలో సాధించవలసిన ప్రగతిని 3 సంవత్సరాలలోనే సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఆమె అన్నారు. బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇక నుంచి ఇబ్బంది కలుగదన్నారు. గ్రామస్తుల కోరికల మేరకు గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చూపుతామన్నారు. ప్రజా జీవితం స్తంభించిపోకుండా తీసుకునే చర్యలలో భాగంగా లాక్ డౌన్ ఎత్తివేశామన్నారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. భౌతిక దూరాన్ని పాటించడం, ముఖాలకు మాస్కులు ధరించాలన్నారు. ప్రజా రక్షణే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, రోహిత్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.