గుండుతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన..

by Shyam |   ( Updated:2021-12-20 01:14:11.0  )
గుండుతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన..
X

దిశ, సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో నిరసనలు వెల్లువెత్తాయి. నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామ ప్రజలు కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం మోదీ పాలనను ఎండగడుతూ గ్రామానికి చెందిన నేతుల యాదగిరి గుండు చేయించుకుని నిరసన వ్యక్తం చేశారు. యాసంగి వరి పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పేంత వరకు రైతుల నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story