వర్షం కోసం సర్పంచ్‌ని గాడిదపై తిప్పిన గ్రామస్థులు.. ఎక్కడంటే?

by Shamantha N |   ( Updated:2021-07-24 06:41:25.0  )
వర్షం కోసం సర్పంచ్‌ని గాడిదపై తిప్పిన గ్రామస్థులు.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా ప్రాంతాలలో వింత సాంప్రదాయాలు ఉంటాయి. వాటిని అందరూ తప్పనిసరిగా పాటిస్తారు. అయితే కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లి చేయడం లాంటివి చేస్తారు. కానీ, మధ్యప్రదేశ్‌లో మాత్రం వింత ఘటన చోటుచేసుకుంది. చాలా రాష్ట్రాలు వర్షాలతో నిండిపోతూ ఉంటే. మధ్యప్రదేశ్‌లో మాత్రం వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. దీంతో ఆ గ్రామస్థులు తమ సర్పంచ్‌ను గాడిదపై ఊరేగించి పండగ చేసుకున్నారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా రంగా గ్రామంలో చోటు చేసుకుంది. అయితే వర్షాల పడాలని ఆ గ్రామంలో సర్పంచ్‌ను గాడిదపై కూర్చోపెట్టి ఊరేగింపు చేయడం అనాదిగా కొనసాగుతున్న ఆచారం. దీంతో గ్రామస్థులు ఈలలు.. కేకలు వేస్తూ ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొని సర్పంచ్‌ను ఊరేగింపు చేస్తారు. ఊరేగింపు ముగిసిన తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వర్షాలు కురవాలని గ్రామస్థులు ప్రార్థిస్తారు.

Advertisement

Next Story

Most Viewed