- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమానుషం.. అభివృద్ధి చేయాలంటూ కాళ్ల మీద పడ్డారు
దిశ, చిన్నగూడూర్: గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ కాళ్ల వేళ్ల పడ్డారు. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో శనివారం గ్రామ సభ రసాబాసగా మారింది. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులపై గ్రామస్థులు గ్రామ సర్పంచ్‌ని నిలదీశారు. గ్రామ సభకు గ్రామ స్థాయి అధికారులు హాజరుకాకపోవటంతో గ్రామ సభలో గందరగోళం నెలకొంది. బాంచెన్ సారు కనికరించండి అంటూ గ్రామ సభలో సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ కాళ్లపై పడి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్థులు వేడుకున్నారు.
పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చి దిద్దాలనే సంకల్పం నీరుగారిపోతోంది. పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సర్పంచ్ కాళ్లపై పడాల్సిన దుస్థితి దాపురించింది. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి చిన్న గూడూరు సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, పాలకవర్గం పై చర్యలు తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.