Tanikella Bharani: అయ్యప్ప మాలలో దర్గాను దర్శించుకున్న రామ్ చరణ్.. వైరల్ అవుతున్న తనికెళ్ల భరణి కామెంట్స్..!

by Anjali |   ( Updated:2024-11-23 07:32:37.0  )
Tanikella Bharani: అయ్యప్ప మాలలో దర్గాను దర్శించుకున్న రామ్ చరణ్.. వైరల్ అవుతున్న తనికెళ్ల భరణి కామెంట్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో రామ్ చరణ్(Ram Charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వరుస సినిమాలతో ప్రేక్షకులు అలరించే బిజీలో పడిపోయారు. సంక్రాతి కానుకగా గ్లోబల్ స్టార్ నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ (game changer) చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ రీసెంట్‌గా అయ్యప్ప మాల వేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చరణ్ అయ్యప్ప మాలలో కడప(Kadapa)లోని పెద్ద దర్గాను దర్శించుకున్నారు. అయితే మాలలో ఉండి.. దర్గాను దర్శించుకోవడంపై సోషల్ మీడియాలోనే జనాలు పలు కామెంట్స్ చేశారు.

పవిత్రమైన అయ్యప్ప స్వామి మాల(Ayyappa Swamy Mala) వేసుకుని.. దర్గాకు వెళ్లడం సరైంది కాదని అన్నారు. దీనిపై ఆధ్యాత్మిక గురూజీ రాధా మనోహర్ దాస్(Spiritual Guru Radha Manohar Das) స్పందించి.. రామ్ చరణ్ చేసినదాంట్లో తప్పేంలేదని తేల్చి చెప్పారు. ఇకపోతే తాజాగా మతం అంటే కలిపేది విడదీసేది కాదంటూ తనికెళ్ల భరణి ఓ సినిమాలో చేసిన కామెంట్స్‌కు రామ్ చరణ్ దర్గాను దర్శించుకున్న ఫొటోలు సింక్ చేసి పలువురు జనాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తనికెళ్ల భరణి కామెంట్స్ చూసినట్లైతే..

‘‘41 రోజులు నిష్ఠగా మాల వేసుకునే అయ్యప్ప స్వామి భక్తులు ముందుగా వెళ్లేది బాబర్ స్వామి మసీద్‌(Babar Swami Masjid)కు.. మతం అంటే కలిపేది విడదీసేది కాదు. ఇప్పేడేమిటి ఎన్నో శతబ్దాలుగా ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసే ఉంటున్నారు. బీబీ నాంచరమ్మ(Bibi Nancharamma)ను ఆ ఏడుకొండలవారు పెళ్లి చేసుకున్నారని.. కడపలోని ముస్లింలు వెంకటేశ్వర స్వామి(Lord Venkateswara)ని తన ఇంటి అల్లుడిగా భావించి.. పూజలు చేశారు. వేములవాడ శివాలయం(Vemulawada Shiva Temple)లోపల ఒక దర్గా ఉంది. శివ భక్తుల్ని ముస్లిం మత పెద్దలు ఆశీర్వదించే అపూర్వ దృశ్యం మనం అక్కడ చూడొచ్చు.

చార్మినార్(Charminar) లో ఒక బినార్(Binar) కింద సాక్షాత్తు అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ అమ్మవారికి లక్ష్మీ పూజ చేసి దీపావళి కాంతులతో వెలిగిపోతుంది. ఢిల్లీ సుల్తాన్(Sultan of Delhi) కుమార్తె విష్ణుమూర్తి(Lord Vishnu)ని ఆరాధించేది. దీన్ని ఏ మతాధిపతి వ్యతరేకించలేదు. ఏ మౌలాలు అడ్డగించలేదు. గోల్కొండ కోటలోని అమ్మవారి గుడి.. అక్కడ జరిగే బోనాల పండుగ మత సామరస్యానికి పట్టాభిషేకం’’. అంటూ తనికెళ్ల భరణి ఎంతో గొప్పగా వివరించిన తీరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed