Pushpa 2 : ‘పుష్ప2’ నుంచి ‘కిస్సిక్’ సాంగ్ ప్రొమోను రిలీజ్ చేసిన మేకర్స్

by Prasanna |   ( Updated:2024-11-23 15:08:41.0  )
Pushpa 2 :  ‘పుష్ప2’ నుంచి ‘కిస్సిక్’ సాంగ్ ప్రొమోను రిలీజ్ చేసిన మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా (Allu Arjun )న‌టిస్తున్న సినిమా పుష్ప 2 ( Pushpa 2) సుకుమార్ ( Sukumar ) డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాలో ర‌ష్మిక హీరోయిన్ ( Rashmika Mandanna )గా నటించింది. వరల్డ్ వైడ్ గా డిసెంబ‌ర్ 5న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది. రిలీజ్ డేటు దగ్గర పడటంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ జోరు పెంచింది. దీనిలో భాగంగానే ఈ సినిమాలోని ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, పాటలు మూవీ పై అంచ‌నాల‌ను భారీగానే పెంచాయి.

తాజాగా, ఈ మూవీ నుంచి మాస్ పాటను న‌వంబ‌ర్ 24 న రిలీజ్ చేస్తామ‌ని ప్రకటించారు. అయితే, ఈ రోజు ఈ పాట‌కు సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేశారు. ఈ ప్రొమో అందర్ని ఆక‌ట్టుకుంటోంది. ఫుల్ సాంగ్ కోసం రేప‌టి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. నవంబర్ 24న రాత్రి 7:02 నిమిషాలకి పూర్తి పాట విడుదల కానుంది.

కిస్సిక్ పాటను తెలుగు, తమిళం, కన్నడ ఈ మూడు భాషల్లోనూ సుబ్లాషిని పాడారు. హిందీలో కూడా సుబ్లాషినితో పాటు లోహితా పాడారు. ఇక మలయాళంలో ప్రియా జెర్సన్, బెంగాలీలో సింగర్ ఉజ్జయిని ముఖర్జీ పాడారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.


Read More..

నెలలో 15 రోజులు ఆ వ్యాధితోనే ఇబ్బంది పడ్డాను.. స్టార్ సింగర్ ఎమోషనల్ కామెంట్స్


Advertisement

Next Story

Most Viewed