సర్పంచ్ భర్త ఒళ్లు చింతపండు చేసిండ్రు !

by Shyam |   ( Updated:2021-01-26 05:02:50.0  )
సర్పంచ్ భర్త ఒళ్లు చింతపండు చేసిండ్రు !
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికార పార్టీ సర్పంచ్‌ భర్తకు గ్రామస్తులు ఒల్లు చింతపండు చేశారు. రామన్నపేట మండలం శోభనాద్రిపురంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని సర్పంచ్ భర్త శ్రవణ్‌కుమార్‌పై గ్రామస్తులు చేయి చేసుకున్నారు. డబ్బులు అడిగిన ప్రతిసారి కులం పేరుతో దూషిస్తున్నాడని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంగళవారం మరోసారి గ్రామస్తులకు, సర్పంచ్ భర్త శ్రవణ్‌కుమార్ మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు సర్పంచ్‌ను చితకబాదారు.

Advertisement

Next Story

Most Viewed