గ్రామ వాలంటీర్ అత్యుత్సాహం: మరణించిన మహిళకు పింఛన్

by Anukaran |   ( Updated:2021-03-01 10:54:05.0  )
గ్రామ వాలంటీర్ అత్యుత్సాహం: మరణించిన మహిళకు పింఛన్
X

దిశ వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో ఓ వాలంటీర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఏం చేసినా అడిగేవారు లేరనుకున్నాడో ఏమో ఏకంగా మరణించిన మహిళకు పింఛన్ మంజూరు చేశారు. ఈ ఘటన రాష్ట్రం వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ షాకింగ్ ఘటన జిల్లాలోని గుర్ల మండలం గుర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఇజ్జిరోతు త్రీనాథ్ అనే వ్యక్తి గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇదే గ్రామంలో ఎర్ర నారాయణ అనే మహిళ చనిపోయింది.

ఒకటో తారీఖు కావడంతో పింఛన్ పంపిణీ చేస్తున్న ఆ వాలంటీర్ చనిపోయిన మహిళ దగ్గర వేలిముద్ర తీసుకుని ఆమెకు ఫించన్‌ను పంపిణీ చేశాడు. దీంతో గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యురాలు మరణించిందన్న బాధలో తాము ఉంటే వాలంటీర్ అధికారుల మెప్పుకోసం ఇలాంటి పనులు చేయడమేంటని బంధువులు నిలదీశారు. ఇలా చేయడం సరికాదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు స్పందించారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి వేలిముద్రలు పనిచేయవని సుబ్బారావు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించామని.. గుర్ల ఎంపీడీవోను విచారణ అధికారిగా నియమించినట్లు పీడీ సుబ్బారావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed