‘విలేజ్ టెకీ’లకు వింత అనుభూతి..

by Shyam |
‘విలేజ్ టెకీ’లకు వింత అనుభూతి..
X

దిశ ప్రతినిధి, మెదక్ :

సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, మైసూర్, ముంబై వంటి నగరాలు. ఈ నగరాలకు ఎక్కడెక్కడి నుంచో యువత వచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితి, వారి జీవనశైలి మారింది. వైరస్ ప్రభావంతో సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లు బంద్ అయ్యాయి. సమూహాలుగా ఉద్యోగాలు చేసేందుకు కంపెనీలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. సజావుగా పని సాగేందుకు ఆయా కంపెనీలు వెసులుబాటు కల్పించాయి. దీంతో పొరుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా ప్రస్తుతం వారి స్వగ్రామాలకు చేరుకున్నారు.

చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఇంటి నుంచే తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకప్పుడు స్వరాష్ట్రం, జిల్లా, మండల, గ్రామాల్లో వివిధ వృత్తులు, ఉద్యోగాలను యువత నిర్వర్తించే వారు. రాను రాను మారుతున్న కాలానికనుగుణంగా స్థానికంగా ఉద్యోగాలు రావడం కష్టంగా మారింది. దీంతో వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేందుకు పలువురు యువతీ, యువకులు ఉద్యోగాల ఇంటిని విడిచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు. ప్రధానంగా తెలంగాణాలోని హైదరాబాద్, కర్నాటక లోని బెంగుళూరు, తమిళనాడులోని చెన్నై, ముంబై, మైసూరు తదితర రాష్ట్రాలకు వెళ్తుండేవారు.

కరోనా వైరస్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల జీవితాల్లో చాలా మార్పులను తీసుకొచ్చింది. వైరస్ వ్యాప్తి పెరగడంతో వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలు నెలల తరబడి బంద్ చేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కొంతకాలం తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలు నిర్వర్తిస్తుండటంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో పలు సాప్ట్‌వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు అనుమనిచ్చాయి. దీంతో చాలా మంది ఉద్యోగస్తులు ల్యాప్‌టాప్ పట్టుకుని స్వగ్రామాలకు చేరుకున్నారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు కుటుంబసభ్యులతో హాయిగా గడుపుతున్నారు.

సొంత ఊరిలోనే..

నేను హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఎప్పుడూ ఆఫీస్, ట్రాఫిక్‌లో బిజీబిజీగా ఉండేవాళ్లం. ప్రస్తుతం కరోనా‌తో తీరు మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో సొంత గ్రామానికి చేరుకుని ఇక్కడి నుంచి పని చేస్తున్నా. ఒక పక్క పని చేస్తూనే.. మరో పక్క కుటుంబసభ్యులతో ఆనందంగా ఉన్నా. కరోనా వలన వింత అనుభూతి ఎదురైనా.. విలేజ్‌లో పనిచేసుకుంటూ అందిరికీ దగ్గరంగా ఉండటం చాలా నచ్చింది.

– గొల్లపల్లి రవి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, చిన్నకోడూరు, సిద్దిపేట జిల్లా

Advertisement

Next Story

Most Viewed