- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పంటమార్పిడి విధానానికి గ్రామాల ఏకగ్రీవ తీర్మానం
దిశ, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట మార్పిడి విధానాన్ని అమలుపరచడం సంతోషించదగ్గ విషయమని, దీనిని తమ గ్రామంలో స్వాగతిస్తున్నామని సిద్ధిపేట జిల్లా నంగునూర్ మండలం మైసంపల్లి, నాగరాజుపల్లి గ్రామాల ప్రజలు తీర్మానం చేశారు. మంత్రి హరిష్ రావు ఆదేశాల మేరకు మైసంపల్లి, నాగరాజుపల్లి గ్రామాల్లో ప్రభుత్వం చెప్పినట్టుగా పంట మార్పిడి విధానాన్ని అమలు పరిచేందుకు రైతులంతా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఏకగ్రీవ తీర్మానం చేశారు. సిద్ధిపేట నియోజకవర్గంలో మొట్టమొదటి గ్రామాలుగా పంట మార్పిడి విధానాన్ని స్వాగతించడం హర్షించదగ్గ విషయమని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ ఉమా వెంకటరెడ్డి అన్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగి ఉన్నతంగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, రైతులు అధిక దిగుబడి వచ్చే పంటలు వేయాలని ప్రభుత్వం సూచిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్, మండల రైతు సమన్వయ కన్వీనర్ బద్దిపడగ కిష్టారెడ్డి, సర్పంచులు రాజేల్లేయ్య. పాకాల కల్పన బాబు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బాబా, శంకరయ్య, శ్రీనివాస్, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.