- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హడలెత్తిస్తున్న గ్రామ సింహాలు.. 20 గొర్రె పిల్లలు మృతి
దిశ, కుబీర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ సింహాలు (వీధి శునకాలు) హడలెత్తిస్తున్నాయి. గుంపులుగుంపులుగా గ్రామాల్లో తిరుగుతుండటంతో పెద్దలు, పిల్లలు సైతం భయాందోళనకు గురవుతున్నారు. కొన్నిరోజుల కిందట పాల్సి గ్రామంలో గొర్రెల మందలోకి చొరబడి వీధికుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 20 గొర్రె పిల్లలు చనిపోయాయి.
అదే విధంగా కుబీర్ మండలంలోని గొర్రెల మందలోకి చొరబడి గొర్రెలను చంపేస్తున్నాయి. వీధి కుక్కల దాడులు రోజురోజుకూ పెరుగుతుండటంతో చిన్న పిల్లలు, పెద్దలు రోడ్డు వెంబడి నడవాలంటే జంకుతున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గిరిజన తండాల్లోని ఊర కుక్కలు నీలుగాయి లాంటి అడవి జంతువులను సైతం గాయపరుస్తున్నాయి. వీటిని అడ్డుకునే వారు లేకపోవడంతో సంతానోత్పత్తి ఎక్కువైపోయి వీధుల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులుగా వెళ్తున్న కుక్కలను బెదిరించే ప్రయత్నం చేస్తే తిరగబడి దాడులు చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి కుక్కల సంతతిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
- Tags
- adilabad