- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా భూమి లాక్కుంటే తీవ్ర పరిణామాలు.. దళితులు
దిశ, వనపర్తి: పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి గ్రామంలో రైతువేదిక, ఉద్యానవనం కోసం కేటాయించిన భూమి చదునుచేసే క్రమంలో స్థానిక దళితులు శుక్రవారం అడ్డుకున్నారు. పెబ్బేరు తహసీల్దార్ ఘాన్సీ రామ్, స్థానిక పోలీసుల సహకారంతో గ్రామ సమీపంలో ఉన్న భూమిని ఒక ఎకరా రైతు వేదిక, మరో ఎకరా పార్కు ఏర్పాటు చేయటం కోసం జేసీబి సాయంతో చదును చేయటానికి అధికారులు ప్రయత్నించారు. అదే క్రమంలో స్థానిక దళితులు తమకు ఇందిరమ్మ ఇండ్ల కోసం భూమిని కేటాయించిందని తెలిపారు. మా భూమిని మాకు అప్పగించేవరకూ పోరాడతామని తెలిపారు. వివరాళ్లోకి వెళితే.. సర్వే నెంబరు 176,177లలో గ్రామంలోని కురుమ సామాజిక వర్గానికి చెందిన వారితో 2005లో దళితులకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం మూడెకరాల భూమిని కొనుగోలు చేసిందని గ్రామస్తులు తెలిపారు. అప్పటి ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రయత్నం చేశారు. కొంతమందికి తక్కువ కావటంతో ఇంకొంత భూమికోసం ఎదురు చూడటంలో తాత్సారం జరిగిందని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్‌గా ఉన్నప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎండార్స్ చేశారని తెలిపారు. మా ఇంటి స్థలాలకు సంబంధించిన భూమిని కావాలని కొందరు నాయకులు వివాదాలకు తెరతీస్తున్నారని గ్రామ దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. మా భూమిని దక్కించుకునే వరకూ ఉద్యమిస్తామని హెచ్చరించారు.