‘వికాస్ బైసెక్సువల్’ అని దూరం పెట్టలేదు : తల్లి

by Shyam |
‘వికాస్ బైసెక్సువల్’ అని దూరం పెట్టలేదు : తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ కంటెస్టెంట్, యాక్టర్ వికాస్ గుప్తా.. తన తల్లి శారదా గుప్తా, సోదరుడు సిద్ధార్థ్ గుప్తాలపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తను బైసెక్సువల్ అని తెలిశాక పూర్తిగా బంధం తెంచుకుని వెళ్లిపోయారని, తన వల్ల సమాజంలో చిన్నతనంగా ఉంటుందనే అలా చేశారన్నాడు. అందుకే బ్రదర్ సిద్ధార్థ్ గుప్తా కూడా తన బర్త్‌డే సెలెబ్రేషన్స్‌కు పిలవలేదన్నాడు. ఈ ఆరోపణలు చేసి రెండు నెలలు కావస్తుండగా తాజాగా అతని తల్లి స్పందించింది.

‘సహనానికి కూడా పరిమితులుంటాయి. మీకు కావాల్సిన దాని కోసం మీరు పోరాడకపోతే.. మీరు కోల్పోయిన దాని కోసం ఏడవకూడదు’ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడంటూ ఈ విషయంపై లాంగ్ నోట్ రిలీజ్ చేసింది శారద గుప్తా. లైంగికత కారణంగా కొడుకును నిరాకరించానని వికాస్ చెప్పడం ఊహించలేకపోయానని చెప్పింది. తమ కుటుంబం వికాస్‌ను ఎప్పటికీ ప్రేమిస్తుందన్న శారద.. తన నుంచి దూరంకావాల్సి వచ్చినందుకు కారణం మాత్రం అది కాదని తెలిపింది. మీడియాలో అతని గురించి చెడుగా చిత్రీకరించడం మాకు ఇష్టం లేదని, కానీ వికాస్ మాత్రం అదే చేశాడని చెప్పింది. మేము దూరంగా వచ్చేయడాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని పూర్తి నకిలీ వార్తను సృష్టించాడని, కుటుంబం గురించి అవమానకరమైన ప్రకటన చేశాడని వెల్లడించింది. దూరమైన మేము నిశ్శబ్దంగా ఉంటే తను మాత్రం బహిరంగ ప్రకటన చేసి పెద్ద నింద వేశాడని.. ఇది కుటుంబ ఓటమి అని బాధపడింది తల్లి. ఈ విషయంలో ఇదే తన తొలి, చివరి ప్రకటన అని.. తమకు గౌరవం, ప్రైవసీ ఇవ్వాలని మీడియాను అభ్యర్థించింది.

Advertisement

Next Story