కరోనా రూల్స్ బ్రేక్ చేసిన నటుడు అరెస్ట్

by Shyam |
కరోనా రూల్స్ బ్రేక్ చేసిన నటుడు అరెస్ట్
X

దిశ, సినిమా : కాంట్రవర్సీ వీడియోలకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘బిగ్ బాస్ 13’ ఫేమ్ యాక్టర్ వికాస్ ఫటక్‌ అరెస్ట్ అయ్యాడు. విద్యార్థుల పరీక్షలన్నింటిని క్యాన్సల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. ముంబై శివాజీ పార్క్ దగ్గర దీక్ష చేస్తానని శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అయితే ఇంటి నుంచి దీక్షాస్థలికి వచ్చే క్రమంలో పోలీసులు అడ్డుకుంటారనే ఉద్దేశంతో.. శనివారం రోజు ఆ ప్రదేశానికి చేరుకునేందుకు అంబులెన్స్‌ను ఉపయోగించాడు. పైగా శివాజీ పార్క్ దగ్గర నిరసన కూడా చేపట్టాడు. దీంతో కొవిడ్ రూల్స్ బ్రేక్ చేసినందుకు శివాజీ పార్క్ పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 188, సెక్షన్ 269, సెక్షన్ 11, సెక్షన్ 51ల కింద కేసు నమోదు చేశారు. ఈ సమయంలో అంబులెన్స్‌ను ఉపయోగించడం కీలకమైన వైద్యసదుపాయాన్ని దుర్వినియోగం చేయడమే అన్న జోన్ 5 డీసీపీ ప్రణయ అశోక్.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed