- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Vallabhanani: మళ్లీ ఎదురుదెబ్బ.. అప్పటి వరకు జైల్లోనే..?

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Gannavaram Former Mla Vallabhaneni Vamsi)కి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) కార్యాలయంపై దాడి కేసులో ఆయన రిమాండ్(Ramand) గడువును న్యాయమూర్తి పొడిగించారు. ప్రస్తుత రిమాండ్ గడువు ముగియడంతో వంశీని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో మరో 14 రోజులపాటు ధర్మాసనం రిమాండ్ విధించింది. ఈ మేరకు తిరిగి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)కు తరలించారు.
కాగా వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయం(Tdp Office)లో వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. అయితే అప్పట్లో ఈ కేసు ముందుకు నడవలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు ముందుకు సాగింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదల అయ్యారు. ఇదే కేసులో 71వ నిందితుడిగా ఉన్న వల్లభవనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తన ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు. అయితే బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపున వాదనలు వినిపిస్తున్నారు. దీంతో వంశీ రిమాండ్ గడువును న్యాయమూర్తి పొడిగించారు. ఈ రోజు జరిగిన విచారణలోనూ వంశీ రిమాండ్ గడువును జడ్జి మరో 14 రోజులు పొడిగించారు.