PahalgamTerrorist Attack : పహల్గాం ఉగ్రదాడి.. హీరోయిన్ సాయి పల్లవిని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఈమెకు బుర్రుందా ఏం మాట్లాడుతుంది?(వీడియో)

by Sujitha Rachapalli |
PahalgamTerrorist Attack : పహల్గాం ఉగ్రదాడి.. హీరోయిన్ సాయి పల్లవిని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఈమెకు బుర్రుందా ఏం మాట్లాడుతుంది?(వీడియో)
X

దిశ, ఫీచర్స్ : పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన పిక్స్ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. జీవితంలో గొప్ప అనుభవాలను పొందుదామని కశ్మీర్ వెళ్లినవారికి భయంకరమైన అనుభవం ఎదురైంది. మతం అడిగి మరీ భార్య కళ్ల ముందే భర్తను చంపడం.. హనీమూన్‌కు వెళ్లిన జంటలో ఒకరిని కాల్చిపడేయడంతో శవం పక్కనే దిక్కులేని స్థితిలో కూర్చొని ఏడవడం.. చావు నుంచి తప్పించుకునేందుకు పడినపాట్లు.. ఈ విషాద కథలన్నీ కంటనీరు తెప్పిస్తున్నాయి. మంగళవారం మూడు గంటల ప్రాంతంలో ఉగ్రమూకల దాడిలో 26 మంది మృతి చెందారు. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ ‌షా దీనిపై స్పందించారు. బాధితులను పరామర్శించిన అమిత్ షా ఉగ్రవాదులను మట్టుబెట్టేవరకు నిద్రపోమని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హిందు, ముస్లింలు ఐక్యంగా ఉంటే ఇలాంటి ఘటనలు పునారవృతం కావని.. అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచిస్తున్నారు. మనలో మనం కొట్టుకుని చావకూడదని చెప్తున్నారు. కొందరు కేంద్రాన్ని తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ సాయి పల్లవి పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతోంది. ‘‘మన ఆర్మీ పాకిస్తాన్ జనాలను ఉగ్రవాదులు అనుకుంటుంది. వారు కూడా ఇండియా ప్రజలను ఉగ్రవాదులు అనుకుంటారు. ఇదే హింసకు దారితీస్తుంది. మనం ఆలోచించే విధానం అలాంటిది’’ అన్నట్లుగా చెప్పుకొచ్చింది. దీంతో ఈమెకు బుర్రుందా ఏం మాట్లాడుతుంది.. అసలు నేషనల్ క్రష్ ఎలా అయింది.. అని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.



Next Story

Most Viewed