చంద్రబాబుకు ఈ వ్యాధుంది: విజయసాయిరెడ్డి

by srinivas |   ( Updated:2020-02-27 01:19:41.0  )

విశాఖపట్టణంలో యాత్రకు సిద్ధమవుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ మాధ్యమంగా బాబుపై విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి ఆయనకో వ్యాధి ఉందని తీవ్ర పదజాలం వాడారు. ఆ ట్వీట్‌లో ఆయనేమన్నారంటే…

‘చంద్రబాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(Narcissistic personality disorder)అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి. అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయి’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed