- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జగన్, కేసీఆర్, షర్మిలది ట్రై యాంగిల్ బిజినెస్ స్టోరీ’
దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. షర్మిల పార్టీ వెనుక కేసీఆర్, జగన్‌లు ఉన్నారని తెలిపారు. జగన్, కేసీఆర్, షర్మిలది ట్రై యాంగిల్ బిజినెస్ స్టోరీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాలను దోచుకోవడానికి ముగ్గురూ కలసి నాటకం ఆడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2019 ఎన్నికల సమయంలో కేసీఆర్, జగన్ పరస్పరం సహకరించుకున్నారన్నారు. కేసీఆర్, జగన్ ఒక్కటేనని ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. జగన్ ఆస్తులు, పెట్టుబడులు హైదరాబాద్‌లో ఉన్నాయని..అందువల్లే కేసీఆర్‌కు జగన్ సరెండర్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసునన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ సవాల్ చేస్తుంటే జగన్ ఏమి చేయలేని దుస్థితిలో ఉన్నారన్నారు. తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు, హక్కుల కోసం జగన్ అండ్ టీం పోరాటం చేయాలని ఎంపీ కేశినేని నాని సూచించారు.