- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్రజ్యోతిపై విజయసాయిరెడ్డి సెటైర్లు
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రజ్యోతి పత్రికపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా సెటైర్లు వేశారు. ‘ఏంటి కిట్టు కేరాఫ్ ఆంధ్రజ్యోతి. రాజధాని వ్యవహారంపై బీజేపీ నేతలు ఏం మాట్లాడాలో తమరే చెప్తారా? బీజేపీకి మంచి పాలనా అనుభవం వుంది. మీ ఉచిత సలహాలు ఏల? కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అంతలా భయపడకు – నీ పార్ట్‌నర్ చంద్రబాబు కోసం తెరవెనుక ప్రయత్నాలు కొనసాగించు. ప్రధాని మనసులో ఏముందో తొంగి చూస్తావు. జగన్ గారి ఆలోచనేంటో ఆర్నెళ్ల ముందే పసిగట్టేస్తున్నావ్. వదిలేస్తే ట్రంప్, జిన్ పింగ్ సీక్రెట్స్‌నూ బయటపెట్టేస్తావ్. వెర్రి గొర్రెల్లా జనం నమ్మేస్తారనుకున్నావా? ఇది 21వ శతాబ్దం కిట్టప్పా కేరాఫ్ ఆంధ్రజ్యోతి. అప్పుడే ఎన్నికలంటూ ఎత్తుకున్నావేంటి?’ అంటూ ఎద్దేవా చేశారు.
మరో ట్వీట్‌లో ‘రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొగాకు కొనుగోలు కోసం మార్క్ ఫెడ్‌కు 200 కోట్లు కేటాయించి, సీఎం జగన్ గారు రైతుల పట్ల తన అభిమానాన్ని మరో మారు చాటారు. మార్క్ ఫెడ్ దూకుడు పెంచడంతో కిలో పొగాకు ధర రూ.5 నుంచి 10 కి ఎగిసింది. ఇంకా పెరిగి రైతన్నల కష్టాలకు ప్రతిఫలం లభిస్తుంది. హోం క్వారంటైన్లో ఉన్న కరోనా రోగులకు ప్రత్యేక కిట్లు అందజేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందులో మందులు, మాస్కులు, గ్లవ్స్, శానిటైజర్లు, పల్స్ ఆక్సీమీటర్లు ఉంటాయి. వ్యాధి బారిన పడిన వారిని పసిబిడ్డల్లా రాష్ట్ర ప్రభుత్వం సంరక్షిస్తోంది. ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక అభినందనలు’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.