- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ తర్వాత… ముందు ఇక్కడ సంగతేంటి కేటీఆర్ -రాములక్క
దిశ, వెబ్ డెస్కు: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న వారికి కేటీఆర్ మద్దతు ప్రకటించడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రంగా విమర్శంచారు. ‘అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు పెడుతాడంటా’ అనే సామెత టీఆర్ఎస్ నాయకులకు సరిగా సరిపోతుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే అర్ధం అవుతుందన్నారు.
ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన తెలంగాణలోని నిజాం ఘగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ లాంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చారు. ఇప్పుడు వాటి ప్రస్థావన లేదు కాని విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై చిర్రుబుర్రులాడుతున్నారని మండిపడ్డారు. ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల గురించే కానీ ఆంధ్రప్రాంతం ప్రజలపై ప్రేమతో కాదు. వీరు ఆంధ్ర ప్రజలను ఎంత అసభ్యకరంగా అవమానించేవారో కొందరు నేతలు గతం గుర్తుచేసుకుంటే మంచిదన్నారు.