అవార్డు ఫంక్షన్లు నచ్చవు.. కానీ ఈ సారి పక్కా వెళ్తా : సేతుపతి

by Jakkula Samataha |
vijay setupathi
X

దిశ, సినిమా : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫస్ట్ నేషనల్ అవార్డు విన్నింగ్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్, కొలిగ్స్ విషెస్‌తో హ్యాపీగా ఉన్నాడు. కాగా ‘సూపర్ డీలక్స్‌’లో తను పోషించిన ట్రాన్స్‌జెండర్ పాత్ర ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి హెల్ప్ అవుతుందని, ప్రజలు థర్డ్ జెండర్స్‌ను యాక్సెప్ట్ చేసేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. తను పనిచేసేటప్పుడు ఎలాంటి అవార్డులు ఆశించనని, గత రెండేళ్లుగా అవార్డు ఫంక్షన్లకు వెళ్లడం కూడా మానేశానన్న సేతుపతి.. నేషనల్ అవార్డు రావడం నిజంగా సర్‌ప్రైజింగ్‌గా ఉందని, కంగ్రాట్స్ విషెస్‌కు ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కావడం లేదన్నాడు.

కానీ ఈసారి ఖచ్చితంగా అవార్డు ఫంక్షన్‌కు వెళ్తానని, రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకుంటానని తెలిపాడు. అయితే ఈ అవార్డు రావడానికి కారణం మాత్రం డైరెక్టర్ తియరాజన్ కుమారరాజా అని, ఈ క్రెడిట్ అంతా తనకే దక్కుతుందన్నాడు. సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ ఎదుర్కొంటున్న కష్టాలను శిల్ప అనే పాత్ర ప్రయాణం ద్వారా చూపించాడని, తను ఈ క్యారెక్టర్ రాసిన విధానం తనను ఇంప్రెస్ చేయడం వల్లే ఇదంతా జరిగిందన్నాడు సేతుపతి.

Advertisement

Next Story

Most Viewed