బద్వేలు బరిలో జనసేన.. విజయజ్యోతితో సంప్రదింపులు ఫలించేనా?

by srinivas |
బద్వేలు బరిలో జనసేన.. విజయజ్యోతితో సంప్రదింపులు ఫలించేనా?
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 1 నుంచి నామినేషన్లు సైతం దాఖలు చేస్తున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాసరి సుధను బరిలోకి దించుతుండగా టీడీపీ ఓబుళాపురం రాజశేఖర్‌ను పోటీకి దించింది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో జనసేన-బీజేపీ అభ్యర్థిపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ బద్వేలు ఉపఎన్నికకు సంబంధించి పోటీ చేసే యోచనలో బీజేపీ లేనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో జనసేన పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని ఇరుపార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా విజయజ్యోతిని బరిలోకి దించనున్నట్లు సమాచారం. ఈ మేరకు జనసేన పార్టీ విజయజ్యోతితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తన మద్దతుదారులతో చర్చించి త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తానని విజయజ్యోతి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విజయజ్యోతి గతంలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు.

2014లో బద్వేలు నుంచే టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2019లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలవలేదు. ఆనాటి నుంచి ఆమె రాజకీయాల్లో స్తబ్దుగా ఉన్నారు. అయితే ఆమెను జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీలు యోచిస్తున్నాయి.

Advertisement

Next Story