మాజీ మంత్రి అవినీతి మార్క్.. 5 కేజీల గోల్డ్, 9 లగ్జరీ కార్స్, వజ్రాలు ఇలా..!

by Anukaran |
మాజీ మంత్రి అవినీతి మార్క్.. 5 కేజీల గోల్డ్, 9 లగ్జరీ కార్స్, వజ్రాలు ఇలా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అధికారులు మాజీ మంత్రికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న పలువురి ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గురువారం ఒకేసారి 35 చోట్ల దాడులు జరిపి భారీగా అవినీతి సొమ్మును పట్టుకున్నారు. అందులో భారీగా బంగారంతో పాటు పలు లగ్జరీ కార్స్, నగదు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

వివరాల్లోకివెళితే.. తమిళనాడు మాజీ మంత్రి కేసీ వీరమణి అక్రమాస్తుల కేసులో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించగా.. అతని నుంచి రోల్స్ రాయిస్‌తో సహా 9 లగ్జరీ కార్లు, దాదాపు 5 కిలోల బంగారం, 47 గ్రాముల వజ్రాలు మరియు 7.2 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ ప్రకటించింది. అంతేకాకుండా మాజీ మంత్రితో సంబంధంతో ఉన్న వ్యక్తుల ఇళ్ళల్లో అనగా ఏకకాలంలో 35 చోట్ల దాడులు చేసిన తర్వాత రూ.1కోటి ఎనిమిది లక్షల విలువైన 34 లక్షల డాలర్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అయితే, మాజీ మంత్రి ఇంటిపై విజిలెన్స్, ఏసీబీ దాడులతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Advertisement

Next Story

Most Viewed