విద్య.. విద్యావంతురాలే!

by Anukaran |
విద్య.. విద్యావంతురాలే!
X

బాలీవుడ్ భామ విద్యా బాలన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా కథను బట్టి తనను తాను ఎలాగైనా మలుచుకోగలదు. నాలో అల్లరి పిల్ల, అమాయకపు యువతి, ఇల్లాలు, ముసలి అమ్మమ్మతో పాటు నేను కూడా ఉన్నాను అని చెప్పే విద్య.. రీసెంట్‌గా వచ్చిన ‘శకుంతలా దేవి’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో హ్యూమన్ కంప్యూటర్, గణిత శాస్త్రవేత్తగా నటించిన విద్య.. ఎప్పటిలాగే మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాదు తన పదో తరగతిలో మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులు స్కోర్ చేసిందో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.

1994లో టెన్త్ క్లాస్ మార్క్ షీట్ షేర్ చేసిన విద్య.. తను మ్యాథ్స్‌లో నాట్ బ్యాడ్ కదా! అంటోంది. 150 మార్కులకు గాను 126 స్కోర్ చేసిన ఈ సీనియర్ హీరోయిన్.. మొత్తానికి 82%తో మెరిట్ స్టూడెంట్‌గా మెప్పుపొందింది. ఇక ‘శకుంతలా దేవి’ సినిమాలో పాస్, ఫెయిల్ అంటూ ఏమి లేదని చెప్పిన విద్య.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పదో తరగతి మార్కులతో పాటు ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా షేర్ చేయాలని అభిమానులను కోరుతోంది.

Next Story

Most Viewed