ఆస్కార్‌కు విద్యాబాలన్ ‘నట్‌ ఖట్’

by Shyam |
ఆస్కార్‌కు విద్యాబాలన్ ‘నట్‌ ఖట్’
X

దిశ, వెబ్‌డెస్క్ :
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించిన షార్ట్ ఫిల్మ్ ‘నట్‌ ఖట్’. ఇప్పటికే ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ షార్ట్ ఫిల్మ్.. తాజాగా ‘బెస్ట్ ఆఫ్ ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2020’ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు గెలవడంతో.. ఆస్కార్ నామినేషన్స్‌లోనూ చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా విద్యాబాలన్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

‘యా.. నేను పట్టరాని సంతోషంలో ఉన్నాను. షార్ట్స్ టీవీ ‘బెస్ట్ ఆఫ్ ఇండియా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌’లో మా షార్ట్ ఫిల్మ్ ‘నట్ ఖట్’ అవార్డు గెలుచుకుందని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. దీంతో ఈ సినిమా ఆస్కార్‌కు క్వాలిఫై అయ్యింది’ అని విద్యాబాలన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్‌లో సాధారణ గృహిణి పాత్రను పోషించిన విద్య.. ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఇక ‘వి ఆర్ వన్ – గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో భాగంగా ఈ సినిమా యూట్యూబ్‌లో టెలికాస్ట్ అయ్యింది. కరోనా కారణంగా ఐఐఎఫ్ఎమ్ ( ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్) ఈవెంట్ ఈ సారి వర్చువల్‌గా జరగగా.. ‘నట్‌ ఖట్’ ఓపెనింగ్ సినిమాగా ప్రదర్శితమైంది. షాన్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను రోనీ స్రూ వాలా, విద్యాబాలన్ నిర్మించగా 2 జూన్, 2020లో విడుదలైంది.

Advertisement

Next Story

Most Viewed