ప్రతీ మహిళ ఆడ సింహమే : విద్యాబాలన్

by Shyam |
ప్రతీ మహిళ ఆడ సింహమే : విద్యాబాలన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్ట్రెస్ విద్యాబాలన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘షేర్ని’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విద్యా విన్సెంట్ పాత్ర పోషించిన విద్య.. సాధారణ మహిళలపై తన ‘పాయింట్ ఆఫ్ వ్యూ’తో పాటు ఈ రోల్ ఎలా దక్కిందనే విషయాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘నిజానికి ప్రతీ మహిళ ఒక ఆడ సింహమే. కొందరు ఈ సినిమాలో విద్యా విన్సెంట్ వలె ఇంట్రావర్ట్స్‌గా ఉంటుండగా.. మరికొందరు మాత్రం బోల్డ్‌గా, ధైర్యంగా ఉండగలరు. కానీ అది వారిని బలహీనులుగా మారుస్తుందని అనుకోలేం. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలకు వారిని బాధ్యులను చేసినా.. తగిన సమయంలో, సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు కలిగి ఉంటారని నమ్ముతున్నా’ అని చెప్పింది. ఇక ‘షేర్ని’ మూవీలో స్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రోల్ ప్లే చేసిన విద్య.. తన డిపార్ట్‌మెంట్‌లో పై అధికారుల నుంచి ఏ విధంగా వివక్ష ఎదుర్కొంది? విధి నిర్వహణలో ఎదురయ్యే అడ్డంకులను నిజాయితీగా ఎలా ఫేస్ చేసిందనే విషయాలను చూపించారు.

Advertisement

Next Story

Most Viewed