‘విద్యార్థి’ టీజర్ టాక్

by Anukaran |   ( Updated:2023-08-18 15:35:48.0  )
‘విద్యార్థి’ టీజర్ టాక్
X

చేతన్ చీను హీరోగా టిక్ టాక్ స్టార్ బన్నీ వాక్స్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ‘విద్యార్థి’. ఎలోన్ ఫైట్ ఫర్ లవ్ అనేది క్యాప్షన్. కాలేజీ‌లో తక్కువ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయితో తిరుగుతున్న అమ్మాయిని వారించే కుటుంబం..తనను దక్కించుకునేందుకు అబ్బాయి చేసే పోరాటమే ‘విద్యార్థి’ కథ. కాగా, కులమత భేదాలతో జరిగిన హింసను చూపించబోతుండగా..జాతీయ గీతం మీద అంత గౌరవం ఉన్న వాళ్లకు తక్కువ జాతి అంటే ఎందుకు అంత కోపం అని సినిమా ద్వారా ప్రశ్నిస్తున్నారు. కంచెలు, కట్టుబాట్లు.. మంచి చెడుల మధ్య ఉండాలి. కానీ, మనుషుల మధ్య కాదు అనే సందేశంతో తెరకెక్కుతున్న ‘విద్యార్థి’ టీజర్‌ను దర్శకులు హరీష్‌శంకర్, సురేందర్ రెడ్డి, నిర్మాతలు సాయి కొర్రపాటి, కె. ఎల్. దామోదర్ ప్రసాద్ రిలీజ్ చేశారు.

మధు మసద్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాన్ని మహస్ క్రియేషన్స్ బ్యానర్‌పై అల్ల వెంకట్ నిర్మిస్తుండగా.. బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Next Story