మనిషితో కలిసి పడుకున్న చిరుత.. వీడియో

by S Gopi |
మనిషితో కలిసి పడుకున్న చిరుత.. వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: మనిషి మరియు చిరుత మధ్య జరిగిన సంఘర్షణల వార్తల గురించే విని ఉంటారు. ఇద్దరి మధ్య స్నేహం దాదాపు అసాధ్యం అని నమ్ముతారు. అయితే, ఈ దీర్ఘకాల భావన తప్పు అని నిరూపించడంలో ఇటీవలి ఓ వీడియో విజయవంతమైంది. ఓ మనిషి మరియు చిరుతలకు సంబంధించిన క్లిప్ ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే. నిద్రిస్తున్న వ్యక్తిని ముగ్గురు వేటాడే జంతువులు చుట్టుముట్టినట్లు కనిపిస్తది. ఆ జంతువులలో ఒకటి నిద్రలేచి అతనితో కలిసి నిద్రపోతుంది. కొన్ని సెకన్ల తర్వాత, ఇతర చిరుతలు కూడా మొదటిదాన్ని అనుసరిస్తాయి. పెద్ద జంతువుల ఉనికిని చూసి కలవరపడకుండా, ఆ వ్యక్తి జీవులను హాయిగా విలాసపరుస్తాడు.

Advertisement

Next Story

Most Viewed