నదిలో మృతదేహాలు.. షాకింగ్ వీడియో వైరల్

by  |
నదిలో మృతదేహాలు.. షాకింగ్ వీడియో వైరల్
X

లక్నో: కరోనాతో మృతి చెందినవారి డెడ్ బాడీలు గంగలో కొట్టుకుపోతున్న ఘటనలతో ఉత్తరప్రదేశ్ ఇటీవలే హెడ్‌లైన్స్‌లకు ఎక్కింది. గంగా తీరాల్లో అడ్డదిడ్డంగా పూడ్చిపెట్టిన ఘటనలూ విమర్శలకు తావిచ్చాయి. తాజాగా, అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బలరాంపూర్ జిల్లాలో రాప్తి నదిపై కట్టిన బ్రిడ్జీపై కొందరు కొవిడ్ పేషెంట్ మృతదేహాన్ని పడేస్తున్న వీడియోను అటుగా కారులో వెళ్తున్న దంపతులు తీశారు. పీపీఈ కిట్ ధరించిన ఓ వ్యక్తితోపాటు మరొకరు డెడ్ బాడీని నదిలో పడేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా వీడియోల కనిపించింది.

ఈ ఘటనపై కేసు నమోదైంది. బలరాంపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వీబీ సింగ్ ప్రకారం, ‘ఈ నెల 25న కరోనాతో హాస్పిటల్‌లో చేరిన ఆ పేషెంట్ 28న మరణించాడు. ప్రొటోకాల్ ప్రకారం, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలో ఆ మృతదేహాన్ని బంధువులు నదిలో పడేసినట్టు తెలిసింది. తాము కేసు పెట్టామని, కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు. గంగలో మృతదేహాలు కనిపించగానే కేంద్ర ప్రభుత్వం స్పందించి డెడ్ బాడీలను నదుల్లో పడేయవద్దని ఉత్తరాది రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, దీన్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా నదీ తీరాల్లో పెట్రోలింగ్ చేయాలని సూచించింది. పేదరికం, అవగాహనలేమి కారణంగా ఇలా మృతదేహాలను నదుల్లో వేస్తున్నారని కేంద్రం భావించింది.

Advertisement

Next Story

Most Viewed