- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వధువు బట్టలు మార్చుకుంటుండగా సడెన్‌గా వచ్చిన పోలీసులు.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: బీహార్ పట్నాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు అక్కడి పోలీసులపై తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. అంతేకాదు.. ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా ఖండించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ వీడియోపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.
వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని పట్నాలో గత ఆదివారం రాత్రి ఓ వివాహ వేడుక జరుగుతోంది. అయితే, ఇదే సమయంలో పోలీసులు అక్కడికి సడెన్ గా ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు.. వధువు బట్టలు మార్చుకుంటున్న రూంలోకి వెళ్లి అక్కడ వస్తువులను పరిశీలించారు. అక్కడున్న బంధువులను సైతం ప్రశ్నించారు. మీరు మందు తాగుతారా..? ఇక్కడ మందు బాటిల్స్ ఉన్నాయా చెప్పండి అంటూ వారిని ప్రశ్నించారు. ఇలా ఆ వివాహ వేడుకలో పోలీసులు హల్ చల్ చేశారు. ఇదంతా కూడా అక్కడున్నవారు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్, ప్రతిపక్షాల నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో పోలీసులు సమాధానమిస్తూ.. మద్యపాన నిషేధంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది.. ఈ నేపథ్యంలోనే తాము సీరియస్ గా వ్యవహరించాల్సి వస్తోందని.. ఆ పెళ్లి వేడుకలో జరిగింది కూడా అందులో భాగమే అని పోలీసులు వివరించారు.