- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెలిగ్రామ్‌లో న్యూ ఫీచర్స్
దిశ, వెబ్‌డెస్క్ :
‘టెలిగ్రామ్’ పాపులర్ యాప్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ వాట్సాప్‌కు ఉన్నంత యూజర్ బేస్ ఈ యాప్‌కు లేదు. కానీ ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఎన్నో యూనిక్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 400 మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్లున్న టెలిగ్రామ్ యాప్‌లో ఇటీవలే వీడియో కాలింగ్ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. మొదటి నుంచి వాట్సాప్‌కు పోటీగా ఉన్న టెలిగ్రామ్.. ఇకముందు మరింత దూకుడు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు తాజాగా సరికొత్త ఫీచర్లను యాడ్ చేసింది.
న్యూ ఫైల్ సైజ్ లిమిట్ : ఫైల్ షేరింగ్ లిమిట్‌ను 1.5 జీబీ నుంచి 2 జీబీకి పెంచింది. అదే వాట్సాప్‌లో అయితే యూజర్లు.. 100 ఎంబీ ఫైల్‌ను షేర్ చేయొచ్చు. అదే వీడియో అయితే 16ఎంబీ మాత్రమే.
ప్రొఫైల్ వీడియో : టెలిగ్రామ్ యూజర్లు తమ ప్రొఫైల్‌గా వీడియోలను కూడా పెట్టుకోవచ్చు. అంతేకాదు, సాఫ్టెన్ స్కిన్ ఫీచర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో సెల్ఫీ ఫొటోలు, వీడియోలు మరింత బెటర్‌గా తీసుకోవచ్చు.
నియర్ బై : ఈ ఫీచర్‌తో మన ఫ్రెండ్స్ ఎంత దూరంలో ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. మనకు దగ్గర్లో ఉన్న నియర్ బై ఫ్రెండ్స్‌ను తెలుసుకోవచ్చన్నమాట.
మల్టీ యూజర్ : మొబైల్ వినియోగదారులు ఇప్పటికే మూడు డివైజ్‌లలో సైన్ ఇన్ అయ్యే అవకాశం ఉండగా.. ఇప్పుడు డెస్క్‌టాప్ యూజర్లకు కూడా ఇదే ఆప్షన్ తీసుకొచ్చింది.
ఎక్స్‌ట్రాస్ : టెలిగ్రామ్ తమ మ్యూజిక్ ప్లేయర్‌ను కూడా రీడిజైన్ చేసింది. న్యూ ఐకాన్స్, ట్రాక్ లిస్ట్‌ను యాడ్ చేసింది. మెసేజ్ ఇన్‌పుట్ బార్‌ను కూడా ఇంప్రూవ్ చేసింది. వీడియో ఎడిటర్ ఉపయోగించి.. యూజర్లు తమ వీడియోలను క్రాప్, రొటేట్ చేసుకోవచ్చు.