- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మా ఇంటి స్థలాన్ని కాపాడండి’
దిశ ప్రతినిధి, ఖమ్మం: కబ్జాదారుల చెర నుంచి తమ భూమిని కాపాడాలని ఓ బాధితుడు మీడియా ఎదుట ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కేంద్రానికి బాధితుడు పుతుంబాక రమేశ్ మీడియా ఎదుట తన గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ… జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ బైపాస్ రోడ్డు సమీపంలోని సర్వే నెంబర్ 88లో 2005లో 200 గజాల ఇంటి స్థలాన్ని తన భార్య పుటుంబాక జానకి పేరుమీద కొనుగోలు చేశానని తెలిపారు.
ప్రస్తుతం ఈ స్థలాన్ని ఇందిరానగర్‌కు చెందిన పి.ప్రవీణ్ అనే వ్యక్తి కబ్జా చేశాడని, దీనిపై ఆయన్ను నిలదీయగా చంపుతానని బెదిరించాడని ఆరోపించారు. ఈనెల 1వ తేదీన ఆ భూమిలో బోరు వేయిస్తున్నాడని తెలిసి, వెళ్లి ప్రవీణ్‌ను ప్రశ్నించగా అతని అనుచరులు ఆయుధాలతో వచ్చి చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి పలుమార్లు రెవెన్యూ అధికారులకు, జిల్లా అధికారులకు తెలియజేసినప్పటికీ తమకు న్యాయం జరుగడం లేదని బాధితుడు రమేశ్ వాపోయారు.