- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కత్రీనాతో డేటింగ్ గురించి అడిగిన కపిల్ శర్మ.. సిగ్గుపడ్డ విక్కీ
దిశ, సినిమా : సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లీలు ఏదైనా మూడునాళ్లే ముచ్చటే అనే ముద్ర పడిపోగా.. తాజాగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, నటి కత్రినా కైఫ్ రిలేషన్షిప్లో ఉన్నారంటూ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ పాపులర్ షో ‘కపిల్ శర్మ షో’ కార్యక్రమానికి ఎంతోమంది బాలీవుడ్ సెటబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్ కోసం రాగా.. రీసెంట్గా ‘సర్దార్ ఉదం’ సినిమా ప్రచారంలో భాగంగా ఆ సినిమా హీరో విక్కీ, డైరెక్టర్ సుజిత్ సర్కార్ హాజరయ్యారు.
ఈ మేరకు విక్కీ, క్యాట్ డేటింగ్లో ఉన్న విషయాన్ని మీడియాకి తెలియనియకుండా జాగ్రత్త పడుతున్నట్లు, అసలు వాళ్ల మధ్యలో ఏం ఉందో అందరికి తెలియజేయాలని హోస్ట్ అడిగాడు. దీంతో ఇబ్బంది పడ్డ యంగ్ హీరో నవ్వుతూ ముఖాన్ని దాచుకున్నాడు. అయితే షో జడ్జి అర్చనా పురాన్ సింగ్ మాట్లాడుతూ..‘ఈ పుకార్లు ఎంతవరకూ నిజమో తెలియదు. కానీ కపిల్ నిప్పుకి ఆజ్యం పోస్తున్నారు’ అని చెప్పింది. దీనికి స్పందనగా విక్కీ నాకు సోదరుడని, కాబట్టి నిజం చెప్పాలనివ్వాలని కపిల్ అనడంతో అక్కడ నవ్వులు పూశాయి. కాగా ఆ ఎపిసోడ్కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఇక విక్కీ, కత్రీనా కలిసి టూరిస్టు ప్లేసుల్లో ఎంజాయ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే.
- Tags
- Katrina kaif