ప్రేమన్నాడు.. వంచించాడు.. ఇలా చేేస్తే ఎలా అంటున్న ప్రియురాలు

by Sridhar Babu |   ( Updated:2021-05-09 09:09:35.0  )
ప్రేమన్నాడు.. వంచించాడు.. ఇలా చేేస్తే ఎలా అంటున్న ప్రియురాలు
X

దిశ, పెద్దపల్లి : ప్రియుడు మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది ఓ ప్రియురాలు. గత మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారట, పెళ్లి మాటెత్తేసరికి ప్రియుడు ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామానికి చెందిన రవళి అనే యువతికి కదంబాపూర్ గ్రామ ఉపసర్పంచ్ కోట సుమంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త రోజులు గడిచేకొద్ది ప్రేమగా మారింది. గత మూడేండ్లుగా ఇరువురు ప్రేమాయణం సాగించారు. సుమంత్‌ను నమ్మి తన సర్వస్వాన్ని అర్పించింది రవళి. అయితే, పెళ్లి మాట ఎత్తేసరికి సుమంత్ తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. దీంతో విసుగుచెందిన ఆమె ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రజాప్రతినిధి ఓ అమ్మాయిని మోసం చేయడం ఏంటని మహిళా సంఘాలు ఆందోళన చేపట్టారు. రెండు సామాజిక వర్గాలు వేర్వేరు కావడంతో తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని సుమంత్ తెలిపినట్లు రవళి వెల్లడించింది. విషయం తెలుసుకున్న పోలీసులు రవళిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించారు.

నాకు న్యాయం చేయండి..

సుమంత్, తాను గత మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకోవాలని అడగడంతో ముఖం చాటేశాడని చెప్పింది. అతనితో వివాహం జరిపించాలని రవళి డిమాండ్ చేస్తోంది. ఓ గౌరవమైన స్థానంలో ఉన్న అతను, తనను మోసం చేద్దామని అనుకోవడంతోనే ఇలా ఇంటి ముందు కూర్చోవలసి వచ్చిందని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేసింది.ప్రస్తుతం ప్రియుడు సుమంత్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. విషయం తెలిసి మహిళా సంఘాలు రవళికి మద్దతుగా నిలిచాయి.

Advertisement

Next Story

Most Viewed