- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రావణ రాజ్యం పోయి.. రామరాజ్యం రావాలి : విజయశాంతి
దిశ, హుజురాబాద్ : తెలంగాణలో ఉద్యమకారులను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి రామరాజ్యం రావాలని పిలుపునిచ్చారు. గురువారం హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో విజయశాంతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. దళిత బంధు పథకం కేసీఆర్ మాయ అని, 60 రోజుల్లో దళితులకు ఎందుకు లబ్ధి చేకూర్చలేదని ప్రశ్నించారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ముందు దళిత వర్గాలు ఆందోళనలకు దిగాలని సూచించారు. బలవంతంగా తన పార్టీని విలీనం చేసుకొని ఆడబిడ్డను నడిరోడ్డుపై నిలబెట్టాడని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటుగా టైగర్ నరేంద్ర, ఇప్పుడు ఈటల రాజేందర్‌ను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తమను బయటకు పంపి ద్రోహం చేస్తే బీజేపీ అక్కున చేర్చుకుందని అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించే వరకూ ఊరుకునేది లేదన్నారు.
దేశంలోనే అట్టడుగు స్థానానికి కేసీఆర్ దిగజారినట్లు జాతీయ సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమానికి ముందుండి, ఇరవై ఏండ్లుగా పార్టీ కోసం, మంత్రిగా ఏడేండ్లు పని చేసిన ఈటలను భూ కబ్జాల నేపంతో నిమిషాల్లో మంత్రి పదవి నుండి తొలగించారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసే నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని పేర్కొన్నారు. గ్యాస్ ధరల గురించి గగ్గోలు పెడుతున్న టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వాటాను ఎందుకు తగ్గించుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావు ఎన్ని కుతంత్రాలు చేసినా ఈటల గెలుపును ఆపలేరని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.