- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సహకరించే వారితోనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు’
దిశ,వెబ్‌డెస్క్: తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామరెడ్డి అన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదనీ..ఎవరినీ బెదిరించలేదని తెలిపారు. తమ ప్రాణాల కోసం తామే పోరాడుతున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీకి కూడా నమ్మకం లేదన్నారు. నిమ్మగడ్డపై దాడి చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలన్నదే ఎస్ఈసీ లక్ష్యమని ఆయన ఆరోపించారు.
ఎన్నికలు జరపాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినా ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ జరిగే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం,ఎస్ఈసీ మధ్య పోరులో ఉద్యోగులు బలవుతున్నారని చెప్పారు. ఉద్యోగులపై ఎస్ఈసీకి ఎందుకంత కక్ష సాధింపని ప్రశ్నించారు. సహకరించే వారితోనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చన్నారు. ఉద్యోగులపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఉద్యోగులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ఉద్యోగ సంఘాలను భ్రష్టు పట్టించింది గత ప్రభుత్వమే అని తెలిపారు.