మాన్సాస్ ట్ర‌స్ట్‌పై హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తాం : మంత్రి వెల్లంపల్లి

by srinivas |
మాన్సాస్ ట్ర‌స్ట్‌పై హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తాం : మంత్రి వెల్లంపల్లి
X

దిశ, ఏపీ బ్యూరో: మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానంలపై ఏపీ హైకోర్టు వెల్లడించిన తీర్పుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. మాన్సాస్ ట్ర‌స్ట్‌పై హైకోర్టుతీర్పును స‌వాల్ చేస్తామని తెలిపారు. దీనిపై అప్పీలుకు వెళతామన్నారు. కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ ట్రస్ట్ పరిధిలో చంద్రబాబు హయాంలో ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. లోకేష్ ఈ విషయం గురించి మాట్లాడటానికి అటు పిల్లాడు కాదు.. ఇటు పెద్దవాడు కాదని విమర్శించారు.

అక్కడ జరిగిన అక్రమాలు జరిగినట్లు గుర్తించామని.. అలాగే తాము ఏది చేసినా చట్టప్రకారం న్యాయబద్ధంగా చేస్తామన్నారు. ఒక కోర్టులో తీర్పు వ్యతిరేకంగా రాగానే లోకేష్ గెలిచినట్లు కాదన్నారు. ఇంకా చాలా కోర్టులు ఉన్నాయని గుర్తు చేశారు. ఇకపోతే బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి విషయంలో చట్ట ప్రకారం చేస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.

Advertisement

Next Story